డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ ల రెన్యూవల్ – యమ్ వినోద్ కుమార్

  • హర్షం వ్యక్తం చేసినటీజీడిసిఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎం – వినోద్ కుమార్

హైదరాబాద్ (సెప్టెంబర్ – 01) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న దాదాపు 804 కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ సర్వీసును 2022 – 23 విద్యాసంవత్సరానికి రెన్యువల్ చేయడానికి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు( జీవో నంబర్ 1385) జారీ చేసినట్లు TGDCLA అధ్యక్షుడు యమ్. వినోద్ కుమార్ తెలిపారు.

ఈ నేపథ్యంలో టీజీడిసిఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎం వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ… ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, రైతుబంధు సమితి అధ్యక్షుడు & ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డికి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ కు, కాలేజియోట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ కు, ఆర్థిక శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Follow Us @