ప్రభుత్వ డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు సంబంధించి కమిషనర్ ప్రోసిడింగ్ విడుదల

  • ధన్యవాదాలు తెలిపిన 475 సంఘం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలకు సంబంధించి ఈరోజు డిగ్రీ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు విడుదల చేసినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.రమణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న 811 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు డిసెంబర్ 2021 నుంచి మార్చి 2022 వరకు వేతనాలకు సంబంధించి 19.11 కోట్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి, విద్యా శాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డికి, డిగ్రీ కమిషనర్ నవీన్ మిట్టల్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్, వి.శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ కే.పీ. శోభన్ బాబు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శంకర్, సయ్యద్ జబీ, ప్రవీణ్, వైకుంఠం, ఉదయశ్రీ, వైయల్ఎన్ రెడ్డి, మధుకర్, పడాల జగన్నాథం, రాష్ట్ర నాయకులు బైరి సుధాకర్, సీహెచ్. భాస్కర్ తదితరులు ధన్యవాదాలు తెలిపారు.

Follow Us @