డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు పల్లా దృష్టికి – వినోద్ కుమార్

ఈ రోజు తెలంగాణ కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్లు అసోసియేషన్ నాయకులు రెండవసారి ఎమ్మెల్సీగా విజయం సాధించిన Dr.పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ లు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీడీఎల్స్ కు ఉద్యోగ భద్రత, 11వ పీఆర్సీ ప్రకారం బేసిక్ పే అమలు, డిస్ట్రబ్ అయినా కాంట్రాక్టు లెక్చరర్లను తిరిగి విదులలోకి వెంటనే తీసుకునేలా చర్యలు తీసుకోవాలని, ఆదాయపన్ను కి సంబంధించి టీడీఎస్ సమస్యను పరిష్కారానికి కృషి చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఒక్కొక్కటిగా కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ల అన్ని సమస్యలు పరిష్కరించడంలో ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటానని హమీ ఇచ్చారని ఎం.వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం.వినోద్ కుమార్, జనరల్ సెక్రెటరీ కదారవల్లి, రాష్ట్ర నాయకులు శ్రదానందం, త్రిభువనేశ్వర్, బాలరాజు, విశ్వనాదం, లక్ష్మణ్ మొదలయిన వారు పాల్గొన్నారు.

Follow Us@