ఎమ్మెల్సీ పల్లా దృష్టికి సీడీఎల్స్ సమస్యలు

డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకుల ముఖ్యమైన సమస్యలను ఈ రోజు అధ్యక్షుడు వినోద్ కుమార్ నేతృత్వంలో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన సీడీఎల్స్ ఏమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.

ఈ సందర్భంగా సీడీఎల్స్ సమస్యలపై అధికారులతో మాట్లాడి… పెండింగ్ లో ఉన్న వేతనాలు, నెలనెలా వేతనాలు, తాజాగా డిస్టర్బ్ అయిన కాంట్రాక్టు అధ్యాపకులు అందరికి వెంటనే వర్క్ లోడ్ ఆధారంగా విధులలోకి తీసుకునేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెంకటేష్, అరుణ కుమారి, శ్రీకాంత్, లక్ష్మణ్, డా. వీరన్న , రాజు నాయక్, కొండల్ రెడ్డి మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు.