విజయవంతంగా డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ ల ఆత్మీయ సమ్మేళనం.

డిగ్రీ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్ల ఆత్మీయ సమేళనం కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ ల సమస్యల పరిష్కారమే ద్యేయంగా జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి దాదాపుగా 400 మంది కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్లు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు, విశిష్ట అతిధులు గా ఎమ్మెల్సీ లు కూర రఘోత్తం రెడ్డి, కాటెపల్లి జనార్దన్ రెడ్డి, మరియు GJLA అధ్యక్షుడు మదుసుధన్ రెడ్డి, సీజేఎల్స్ అధ్యక్షడు కనకచంద్రం తదితరులు హజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ లకు ఉద్యోగ భద్రత మరియు క్రమబద్ధీకరణ కొరకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరం అయ్యే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం. వినోద్ కుమార్, జనరల్ సెక్రెటరీ కాదరవల్లి , రాష్ట్ర నాయకులు మహేష్ కుమార్, నాగరాజు, వినాయకుమార్, అరుణ కుమారి, నీలిమ, కిరణ్మయి, శ్రీకాంత్, బాలరాజు, శ్రోదానందం, త్రిభువనేశ్వర్ పాల్గొన్నారు.

Follow Us@