ప్రధాని అధ్యక్షతన ఉన్నతాధికారులు, మంత్రివర్గ సహచరులతో ఈ రోజు జరిగిన సమావేశంలో CBSE- 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత తమకు చాలా ప్రాముఖ్యమని ఈ అంశంలో ఎటువంటి రాజీ ఉండదని ప్రధాని మోదీ అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొని ఉందన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యార్థులు పరీక్షలకు బలవంతంగా హాజరు కావొద్దన్నారు.
పరీక్షల రద్దుతో సీబీఎస్ఈ ఇప్పుడు ఆబ్జెక్టివ్ ప్రమాణాల ప్రకారం ఫలితాలను వెల్లడించేందుకు చర్యలు చేపట్టనుంది. గతేడాది మాదిరిగానే ఎవరైనా విద్యార్థులు పరీక్షలు రాయాలనుకుంటే పరిస్థితులు అనుకూలంగా మారినప్పుడు వారు పరీక్షలను రాయొచ్చు.
Follow Us@