కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోంది – గాదె వెంకన్న

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న శాసనమండలి, నల్గొండ -ఖమ్మం -వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక సందర్భంగా, చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో , ఆర్జేడీ అపాయింటెడ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకన్న వారి సతిమణితో కలిసి ఓటు వినియోగించుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా గాదె వెంకన్న మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని త్వరలోనే కాంట్రాక్ట్ లెక్చరర్ల అన్ని సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని వారు అన్నారు. నేను చదివిన హైస్కూల్ లో ఓటు వేయడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

Follow Us@