హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నం – సీడీఎల్స్ అధ్యక్షుడు – వినోద్ కుమార్

కాంట్రాక్టు ఉద్యోగులు‌, లెక్చరర్ ల క్రమబద్ధీకరణ పై నిరుద్యోగులు వేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లు TGDCLA రాష్ట్ర అధ్యక్షుడు ఎం. వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

అలాగే త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఏలాంటి షరతులు లేకుండా అందరిని క్రమబద్ధీకరించాలని కోరారు. దీని కొరకు సహకారాన్ని అందించిన రాష్ట్ర సీఎం కేసీఆర్ , విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు.

Follow Us@