VINESH PHOGAT – తీర్పు 16కి వాయిదా

BIKKI NEWS (AUG. 13) : CAS POSTPONED VERDICT ON VINESH PHOGAT APPEAL. పారిస్ ఒలింపిక్స్‌లో ర‌జ‌తం కోసం పోరాడుతున్న‌ భార‌త రెజ్ల‌ర్ వినేశ్ ఫోగాట్ అప్పీల్‌పై తీర్పును అర్బిట్రేష‌న్ కోర్టు (CAS) ఆగస్టు 16కు వాయిదా వేసింది.

CAS POSTPONED VERDICT ON VINESH PHOGAT APPEAL

షెడ్యూల్ ప్ర‌కారం మంగ‌ళ‌వారం రాత్రి 9.30 గంట‌ల‌కు తీర్పు ఇవ్వాలి. కానీ, సీఎస్ ఆగ‌స్టు 16 శుక్ర‌వారం ఏదో ఒక‌టి చెప్తామ‌ని తెలిపింది. దాంతో, మ‌రో మూడు రోజులు నిరీక్షించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది

పారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల విభాగంలో వినేశ్ ఫొగాట్ అంచ‌నాలు అందుకుంటూ ఫైన‌ల్ చేరింది. ఆగ‌స్టు 7 బుధ‌వారం ఉద‌యం అమెరికా రెజ్ల‌ర్ స‌రాహ్ హిల్డెబ్రాండ్త్‌తో ప‌సిడి ఫైట్ కాసేప‌ట్లో ఉంద‌న‌గా నిర్వాహ‌కులు ఆమె బ‌రువు కొలిచారు. అయితే.. 100 గ్రాముల అద‌న‌పు బ‌రువు ఉండ‌డంతో వినేశ్‌ను నిర్వాహ‌కులు అన‌ర్హురాలిగా ప్ర‌క‌టించారు. దాంతో ఫైన‌ల్ ఆడ‌లేక‌పోయిన ఆమె అప్పీల్‌పై అర్బిట్రేష‌న్ కోర్టు (CAS)ను ఆశ్ర‌యించింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు