INTER – ఇంటర్ తర్వాత కెరీర్ గైడెన్స్ పై నేడు టీశాట్ లో ప్రోగ్రామ్

BIKKI NEWS (MARCU 28) : Career guidance programme for inter complete students. ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసిన విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం సరైన కోర్సును ఎంచుకునేలా మార్గదర్శకత్వం అందించేందుకు టి-సాట్- సాఫ్ట్ నెట్ ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్మాణ్ ఫౌండేషన్ మరియు ఆస్మాన్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి.

Career guidance programme for inter complete students

ఈ నెల 28వ తేదీ (శుక్రవారం) ఉదయం 11.00 గంటలకు టి-సాట్ నిపుణ స్టూడియో నుండి ప్రత్యక్ష ప్రసారం కానున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సు చదవాలి? సైన్స్, మ్యాథ్స్, వాణిజ్యం, కళలు లేదా వృత్తి విద్యా కోర్సుల ఎంపికలో విద్యార్థులు ఏమి పరిగణనలోకి తీసుకోవాలి? అనే అంశాలపై నిపుణులు విశ్లేషణ చేయనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ మరియు ప్రయివేట్ విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయగా, వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఈ ప్రసార కార్యక్రమం ఉపయుక్తంగా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పకుండా వీక్షించాలని, భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రీ. కృష్ణ ఆదిత్య, ఐఏఎస్, డైరెక్టర్ & కార్యదర్శి, ఇంటర్మీడియట్ విద్యా శాఖ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ లైవ్ కార్యక్రమం టి-సాట్ నెట్వర్క్ చానళ్లతో పాటు టి-సాట్ యాప్, యూట్యూబ్ ద్వారా అందుబాటులో ఉంటుంది.

T SAT LIVE LINK – https://youtube.com/live/yPs8QnlhjDg?feature=share

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు