ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయాలి – 475 అసోసియేషన్

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రద్దు చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావుకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ,
రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు G. రమణ రెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

ప్రస్తుత covid ప్రభావం తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో, దేశ వ్యాప్తంగా సీబీఎస్ పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని,
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అధ్యాపకులు ఇతర సిబ్బంది కూడా covid పరిస్థితుల దృష్ట్యా ఆందోళనలో ఉన్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించి , మూల్యాంకనం చేసి, పరీక్ష ఫలితాలను , సక్రమంగా ఇచ్చే పరిస్థితులు లేవని తెలిపారు.


ఈ పరిస్థితులన్నీ గమనించి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రకటించి, విద్యార్థులు& తల్లిదండ్రులకు మానసిక ఆందోళన లేకుండా చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుందని కొప్పిశెట్టి సురేష్ విజ్ఞప్తి చేశారు.

Follow Us@