BIKKI NEWS (OCT. 24) : cabinet sub committee on employees issues with bhatti vikramarka. ఈరోజు తెలంగాణ ఎంప్లాయిస్ JAC ప్రతినిధి బృందంతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
cabinet sub committee on employees issues with bhatti vikramarka
ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వారికి భరోసా ఇవ్వడం జరిగిందని సీఎంవో ప్రకటించింది.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తమ సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుండి చర్చల కొరకు పిలుపు వచ్చింది.
ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తి విశ్వాసం ఉంది ఇది తొలి అడుగు మాత్రమే అని త్వరలో ముఖ్యమంత్రితో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.
ఆర్థిక అంశాలైన డీఏలు, పీఆర్సీ వంటి వాటిపై ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరినట్లు నాయకులు తెలిపారు.
మార్చి 2025 తర్వాత ఆర్థిక సంబంధ అంశాలను దశలవారీగా పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపినట్లు నాయకులు తెలిపారు. ఆర్దికేతర విషయాలను వెంటనే పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ప్రకటించినట్లు తెలిపారు.
శుక్రవారం సాయంత్రంలోగా డీఏపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు గారితో కలిసి సీఎం గారు సమావేశమయ్యారు.
ఉద్యోగుల డీఏ చెల్లింపు విషయంపై శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి
గారు చెప్పారు.
ఉద్యోగులకు సంబంధించి వివిధ సమస్యల పరిశీలన కోసం కేబినేట్ సబ్ కమిటీని నియమించారు.
ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు సభ్యులుగా కేశవరావు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.
దీపావళి తర్వాత శాఖల వారిగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కేబినేట్ సబ్ కమిటీ సమావేశమవుతుంది.
జీవో 317 పై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సమర్పించిన నివేదికపై కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.
జేఏసీ ప్రతినిధులతో జరిగిన సమావేశాల్లో ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.