BIKKI NEWS (DEC. 16) : cabinet sub committee decisions on rythu bharosa. రైతు భరోసా పథకానికి తప్పనిసరిగా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే నిబంధన పెట్టాలని, పక్కా నిబంధనలతో పథకాన్ని అమలు చేయాలని రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.
cabinet sub committee decisions on rythu bharosa.
ఈ అసెంబ్లీ సమావేశాలలోనే ఈ సిపార్సులపై చర్చించి నిబంధనలను రూపకల్పన చేయనున్నారు.
కీలక సిఫార్సులు ఇవే…
- ఎన్ని ఎకరాలు ఉంటే అంతకు పెట్టుబడి సాయం అక్కర్లేదని, 7 లేదా 10 ఎకరాలకు పరిమితి పెట్టాలి.
- రాష్ట్రంలోని భూకమతాలను పరిశీలిస్తే 5 ఎకరాల వరకు ఉన్న చిన్న, సన్నకారు రైతులే 90 శాతానికి పైగా ఉన్నారని చెప్పింది.
- ప్రజాప్రతినిధులు (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు), ఐఏఎస్, ఐపీఎస్ లతో పాటు ప్రభుత్వ అధికారులు, టాక్స్ పేయర్స్ లకు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని సిఫార్సు.
- రైతు భరోసా కింద ఎకరాకు రూ.7,500 ఇవ్వాల్సి ఉందని కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది.
- చెట్టుపుట్టలు, రాళ్లురప్పలు, హైవేలు, రోడ్లు, వెంచర్లకు, భూసేకరణ కింద పోయిన భూములకు రైతు భరోసా ఇవ్వరాదు.
- పక్కాగా సాగు భూములకే రైతు భరోసా అందించాలి.
- టెక్నాలజీని వాడుకుని ఏ సర్వే నెంబర్ భూముల్లో ఏయే పంటలు వేశారో శాటి లైట్, డిజిటల్ సర్వేలతో గుర్తించి పెట్టుబడి సాయం అందించాలి”
- వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.
- సాగు భూముల లిస్టులో నుంచి నాన్అగ్రికల్చర్ భూములను తీసేయనుంది. ఇలా కనీసం 15 లక్షల ఎకరాలు తీసేసే చాన్స్ఉన్నట్టు తెలిసింది.
- డిల్లీ కమలం కైవసం
- CURRENT AFFAIRS IN TELUGU 7th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 02 – 2025
- NEET UG 2025 NOTIFICATION – నీట్ యూజీ నోటిఫికేషన్, దరఖాస్తు లింక్
- GRAMMY AWARDS 2025 – గ్రామీ అవార్డులు 2025 పూర్తి జాబితా