ఇంటర్ కామర్స్‌ కోర్సుల్లో సీఏ సిలబస్‌

ఇంటర్మీడియట్ కామర్స్‌ విభాగంపై దృష్టి సారించిన తెలంగాణ ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ICAI) హైదరాబాద్‌ విభాగంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ICAI సంస్థ సహకారంతో సీఏ ఫౌండేషన్‌లోని సిలబస్‌ను బిజినెస్‌ అండ్‌ కామర్స్‌ విభాగంలోని రిటైల్‌ మార్కెటింగ్‌, ఇన్సూరెన్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, అకౌంటింగ్‌ అండ్‌ టాక్సేషన్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌షిప్‌ కోర్సుల్లో సీఏ సిలబస్‌ను చేరుస్తున్నారు.

ప్రతి కోర్సులో ప్రథమ ఏడాదిలో ఒక పేపర్‌, ద్వితీయ సంవత్సరంలో మరో పేపర్‌గా సీఏ సిలబస్‌ ఉంటుంది. కాకపోతే ఇది ఇంటర్‌బోర్డు ఆమోదం పొందకపోవడం, కామర్స్ బోధించే అధ్యాపకులకు శిక్షణ ఇవ్వకపోవడంతో ఈ ఏడాది అమలు చేయడం లేదు, కానీ వచ్చే విద్యా సంవత్సరం (2021-22) అమల్లోకి వస్తుందని చెబుతున్నారు.

Follow Us@