హైదరాబాద్ (ఆగస్టు – 10) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుద్వేల్ లో 100 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియ (BUDWEL LAND AUCTION) ముగిసింది. వేలంలో 3,625 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.
ఇక్కడ అత్యధికంగా ఎకరం రూ.41.25 కోట్లు, అత్యల్పంగా ఎకరా రూ.33.25 కోట్లు పలికింది.
మొత్తం 14 ప్లాట్లకు రూ.3,625 కోట్ల ఆదాయం వచ్చింది. మొదటి సెషన్ లో 7 ప్లాట్లకు రూ.2,057 కోట్లు, రెండో సెషన్ లో 7 ప్లాట్లకు రూ.1,568 కోట్లు వచ్చింది.