★ బౌద్ధ సంగీతులు
● మొదటి సంగీతి :-
- సంవత్సరం :- క్రీ.పూ. 483,
- ప్రాంతం :- రాజగృహం
- రాజు :- అజాత శత్రువు
- అధ్యక్షుడు :- మహకాశ్యప
- ప్రాధాన్యత :- వినయ, సుత్త అనే పీఠికలు (నియమావళి గ్రంధాల) సంకలనం
● రెండవ సంగీతి :-
- సంవత్సరం :- క్రీ.పూ. 383,
- ప్రాంతం :- వైశాలి
- రాజు :- కాలశోకుడు
- అధ్యక్షుడు :- సర్వకామిని
- ప్రాధాన్యత :- బౌద్ధ సంఘం ధేరవాదులు, మహసాంఘీకులుగా చీలిపోయింది.
● మూడవ సంగీతి :-
- సంవత్సరం :- క్రీ.పూ. 253,
- ప్రాంతం :- పాటలీపుత్రం
- రాజు :- అశోకుడు
- అధ్యక్షుడు :- మొగలిపుత్రతిస్స
- ప్రాధాన్యత :- అభిదమ్మ పీఠకాన్ని రచించారు.
● నాలుగో సంగీతి :-
- సంవత్సరం :- క్రీ.శ. 1వ శతాబ్దం
- ప్రాంతం :- కుందల వనం (కాశ్మీర్)
- రాజు :- కనిష్కుడు
- అధ్యక్షుడు :- వసుమిత్రుడు
- ప్రాధాన్యత :- బౌద్ధ మతం మహయాన, హీనయాన శాఖలుగా విడిపోయింది.
★ జైన సంగీతులు :-
● మొదటి సంగీతి :-
- సంవత్సరం :- క్రీ.పూ. 3వ శతాబ్దం
- ప్రాంతం :- పాటలీ పుత్రం
- రాజు :- చంద్రగుప్త మౌర్యుడు
- అధ్యక్షుడు :- బద్రబాహుడు, స్థూల భద్రుడు
- ప్రాధాన్యత :- జైన బోధనలను 12 అంగాలుగా విభజించడం జరిగింది. దిగంబర, శ్వేతాంబరులుగా విడిపోయారు.
● రెండవ సంగీతి :-
- సంవత్సరం :- క్రీ.శ. 512
- ప్రాంతం :- వల్లభి (గుజరాత్)
- రాజు :- —–
- అధ్యక్షుడు :- దేవర దిక్షమ (శ్రమణుడు)
- ప్రాధాన్యత :- అంగాలను అర్ధమగాది బాషలో రాసుకున్నారు. 12 అంగాలు, ఉపాంగాల సంకలనం పూర్తి అయింది. గంధర్వ అనే పవిత్ర గ్రంధాలు క్రమానుసారంగా రాసుకున్నారు. శిల్ప కళను అభివృద్ధి చేశారు.