గురుకుల టీచర్ పోస్టులకు బీటెక్ అభ్యర్థులూ అర్హులే : హైకోర్టు

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో TGT (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్) పోస్టులకు బీఏ, బీకాం, బీఎస్సీలతో పాటు బీఈడీ చేసిన బీటెక్ అభ్యర్దులు కూడా 2014 ఎన్సీటీఈ మార్గదర్శకాలు ప్రకారం అర్హులేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తాజా నిబంధనలకు అనుగుణంగా నియామకాలు కొనసాగాలి తప్ప పాత నిబంధనల ప్రకారం భర్తీ చేస్తామంటే కుదరదని తీర్పులో పేర్కొంది.

టీజీటీ పోస్టులకు బీటెక్ పాటు బీఈడీ ఉన్న అభ్యర్థులను అనర్హులుగా పేర్కొనడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పోస్టులకు బీటెక్ విద్యార్థులు అర్హులేనంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు 2019లో అప్పీల్ చేసింది. ఇరుపక్షాల వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్. తుకారాంజీలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. బీటెక్ తో పాటు బీఈడీ చేసిన అభ్యర్ధులూ టీజీటీ పోస్టులకు అర్హులేనని పేర్కొంది. వెంటనే అభ్యర్థులందరి దరఖాస్తులను పరిశీలించి నాలుగు వారాల్లో నియామకాలు చేపట్టాలని ఆదేశించింది.

down load nikki news app for more updates

Follow Us @