నేడు బీటెక్ సీట్ల ఇంటర్నల్ స్లైడింగ్ కు ద్వారా బ్రాంచ్ మారే అవకాశం

హైదరాబాద్ (సెప్టెంబర్ – 01) : తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ లో భాగంగా బీటెక్ మొదటి సంవత్సరంలో సీటు పొందిన విద్యార్థులు అదే కాలేజీలో ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా సీట్లు మార్చుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకు విద్యార్థులు సెప్టెంబర్ 1న స్లైడింగ్ లో పాల్గొనాలని సాంకేతిక విద్యాశాఖ అధికారులు సూచించారు.

ఇక సెప్టెంబర్ 1న కాలేజీలు స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేయాలని, 2న ఖాళీల వివరాలను ప్రకటించి 3, 4 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు పూర్తిచేయాలని సూచించారు.

ఈ ఏడాది ఇంజినీరింగ్ కోర్సుల్లో 18,815 సీట్లు ఖాళీగా ఉండగా, ఈ సీట్లను ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకొనే అవకాశం ఇచ్చారు.

వెబ్సైట్ : https://tseamcet.nic.in