హైదరాబాద్ (నవంబర్ – 10) : ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) పరిధిలోని నిజామాబాద్ జిల్లా రుద్రూరులోని ఆహార శాస్త్ర సాంకేతిక కళాశాలలో నాలుగేళ్ల బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులో మిగిలిన సీట్ల భర్తీకి నవంబర్ 15న నేరుగా (వాక్ఇన్) కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ వెంకటరమణ తెలిపారు.
ఇంటర్ ఎంపీసీ లేదా బైపీసీ ఉత్తీర్ణులైన విద్యార్థులు హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరిగే ఈ కౌన్సెలింగ్ కు హాజరు కావాలని ఆయన కోరారు.