హైదరాబాద్ (ఎప్రిల్ – 22) : బోర్డర్ సెక్యూరిటి ఫోర్స్ (BSF HEAD CONSTABLE JOBS) పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ అర్హతతో 247 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
◆ మొత్తం పోస్టుల సంఖ్య : 247.
- హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 217 పోస్టులు
- హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): 30 పోస్టులు
◆ అర్హతలు : పోస్టును అనుసరించి 60 శాతం మార్కులతో పదో తరగతి, ఐటీఐ లేదా ఇంటర్మీడియట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
◆ వయోపరిమితి : 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
◆ జీత భత్యాలు : నెలకు రూ.25,500 – రూ.81,100.
◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డిక్టేషన్ టెస్ట్, పేరాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ (హెచ్సీ ఆర్వోలకు మాత్రమే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
◆ దరఖాస్తు ఫీజు : రూ.100 (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎంఎస్సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్
◆ దరఖాస్తుకు గడువు తేదీ : మే 12 – 2023.
◆ రాత పరీక్ష తేదీ : జూన్ 04 – 2023.