ఎంసెట్ ర్యాంక్ తోనే బీఎస్పీ నర్సింగ్ – కాళోజీ వర్సిటీ ప్రతిపాదన

రాష్ట్రంలో వచ్చే ఏడాది (2022-23) బీఎస్సీ నర్సింగ్ సీట్లను ఎంసెట్ ద్వారా భర్తీ చేయడానికి అనుమతి కోసం కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ప్రభుత్వం అనుమతిస్తే బీఎస్పీ నర్సింగ్ ను ఎంసెట్ లో చేర్చనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో నర్సింగ్ సీట్లను విశ్వవిద్యాలయం భర్తీ చేస్తోంది.

ఏదో ఒక ప్రవేశ పరీక్ష ఆధారంగానే బీఎస్సీ నర్సింగ్ పిట్లను భర్తీ చేయాలని భారతీయ నర్సింగ్ మండలి(ఐఎన్‌సీ) అన్ని రాష్ట్రాలను గత ఏడాదే ఆదేశిం వింది. ప్రస్తుత విద్యా సంవత్సరం(2021-22) నుంచి నీట్ స్కోర్ ఆధారంగానూ నర్సింగ్ సీట్లు కేటాయించ వచ్చని సూచించింది. అయితే అప్పటికే నీట్, ఎంసెట్ వెలువడినందున ఇప్పటికిప్పుడు ప్రవేశ పరీక్ష ద్వారా సీట్ల భర్తీ కష్టమని, ఈ ఏడాదికి మిన యింపు ఇవ్వాలని, వచ్చే ఏడాది( 2022-23) ను అమలు చేస్తామని కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం నర్సింగ్ కౌన్సిల్‌ను పోయిన ఏడాది కోరింది.

Follow Us @