ఎంసెట్, నీట్ ర్యాంకులతోనే బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు

హైదరాబాద్ (ఏప్రిల్ 11) : ఈ విద్యాసంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్ ర్యాంకుల ద్వారా భర్తీ చేస్తామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశాలకు నీట్ యూజీ ర్యాంకు లను పరిగణనలోకి తీసుకొంటామని వెల్లడించింది.

నర్సింగ్ అడ్మిషన్లు పొందాలనుకొనే అభ్యర్థులు ఎంసెట్ పాటు నీట్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్ సీట్లను ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారానే భర్తీ చేయాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్సీ)) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.