హైదరాబాద్ (ఫిబ్రవరి – 10) : తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ సీట్లను వచ్చే విద్యా సంవత్సరం (2023-24) ఎంసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలికి కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం లేఖ రాసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఆ కోర్సులో చేరదలచిన వారు ఎంసెట్ ప్రవేశ పరీక్ష రాయవలసి ఉంటుంది.
ఇప్పటివరకు ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్ సీట్లను వర్సిటీ భర్తీ చేస్తోంది. అయితే ఈ సీట్లను ఏదో ఒక ప్రవేశ పరీక్ష ఆధారంగా చేయాలని భారతీయ నర్సింగ్ మండలి (INC) అన్ని రాష్ట్రాలను రెండేళ్ల క్రితమే ఆదేశించింది. ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు జరపాలని గత ఏడాదే ప్రభుత్వం జీఓ ఇచ్చిన నేపథ్యంలో ఎంసెట్ లో చేరేందుకు లేఖ రాశామని కాళోజీ విశ్వవిద్యాలయం ఉపకులపతి కరుణాకర్ రెడ్డి వారం తెలిపారు.