హనుమకొండ (నవంబర్ – 08) బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు (bsc nursing admission 2023-24 last date) మరోసారి దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ
ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఏడాది ఎంసెట్ కు హాజరైన అభ్యర్థులు నవంబరు 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు సంబంధిత ధ్రువపత్రాలతో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని,
బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి ఎంసెట్ కు హాజరైన అభ్యర్థులను చేర్చుకోవడం ద్వారా ఖాళీగా ఉన్న సీట్లను భర్తీళచేయడానికి INC కి ఎలాంటి అభ్యంతరం లేదని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.