విజయవాడ (జూలై – 09) : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU)లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి APEAPCET 2023 BPC STREAM ర్యాంకుల ఆధారంగా బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, బీటెక్ అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.
బైపీసీ స్టీమ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు జులై 8 నుంచి 27 వరకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.
దరఖాస్తు ఫీజు 1,000/- గా ఉంది. SC, ST, PH లకు 500/-
2023 – 24 విద్యా సంవత్సరం ఎన్నారై కోటా సీట్ల భర్తీకి కూడా దరఖాస్తులు ఆహ్వానించినట్లు వివరించారు.
ఎన్నారై కోటాలో సీటుకు గతంలో ఏడాదికి 5వేల డాలర్లు ఫీజు ఉండగా.. ఈ ఏడాది నుంచి 4వేల డాలర్లకు తగ్గించినట్లు తెలిపారు.
◆ వెబ్సైట్ :
https://ugadmissionsangrau.aptonline.in/ANGRAUGRADU/