టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కాంస్య పథకం కోసం ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్‌లో 21-13, 21-15 తేడాతో వరుస గేమ్స్‌లో విజయం సాధించి కాంస్య పథకం సాదించింది. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ సింధు సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే.
సింధు కంటే ముందు రెజ్లర్ సుశీల్‌కుమార్ మాత్రమే ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రెండు మెడల్స్ గెలిచాడు. అతడు 2008 గేమ్స్‌లో బ్రాంజ్, 2012 గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే.
Follow Us @