అంబేద్కర్ వర్శిటీ ప్రవేశాల గడువు డిసెంబర్ 31 వరకు పెంపు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూరవిద్య ద్వారా అందిస్తున్న డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సులకు సంబంధించి అడ్మిషన్ల గడువు డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఇంచార్జ్ రిజిస్టార్ లక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2016 – 2020 వరకు నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాదించి ఎలాంటి కోర్స్ లో ప్రవేశం పొందని విద్యార్థులు కూడా ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు.

అలాగే అడ్మిషన్ పొంది సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోయిన డిగ్రీ సెకండీయర్, థర్డ్ ఇయర్ విద్యార్థులు మరియు పీజీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పూర్తి వివరాలకు వెబ్ సైట్ సందర్శించవచ్చు

వెబ్సైట్ :: https://www.braouonline.in/

Follow Us@