BIKKI NEWS (DEC. 03) : Brain Rot – Oxford word of the year 2024. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్-2024’ గా బ్రెయిన్ రాట్ ను ప్రకటించింది. మానసిక లేదా మేధో స్థితి క్షీణతను బ్రెయిన్ రాట్ అంటారు.
Brain Rot – Oxford word of the year 2024
అవసరం లేని కంటెంట్‌ను అధికంగా వినియోగించడం వల్ల ఇది కలుగుతుంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో తక్కువ నాణ్యత గల ఆన్‌లైన్ కంటెంట్‌తో ఎక్కువగా మమేకం అయినప్పుడు కలిగే దుష్ప్రభావాలపై ఏడాది కాలంగా ఈ పదం విస్తృతంగా వాడుకలోకి వచ్చింది.
బుద్ధి హీనమైన సోషల్ మీడియా అలవాట్లు, నిష్ప్రయోజనకర కంటెంట్ వినియోగంపై విస్తృత ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని ఈ పదాన్ని ఈ ఏడాది పదంగా ఎంపిక చేశారు.
37 వేల మందికిపైగా పాల్గొన్న పబ్లిక్ ఓటింగ్ నుంచి ఆరు పదాలను షార్ట్ లిస్ట్ చేసి అందులో నుంచి బ్రెయిన్ రాట్‌ను వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేశారు.
- డిసెంబర్ నెలలో ముఖ్య విద్య ఉద్యోగ సమాచారం
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 04 – 12 – 2024
- NAVY DAY – నౌకాదళ దినోత్సవం
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 04
- GK BITS IN TELUGU 4th DECEMBER