అంబేద్కర్ వర్శిటీ డిగ్రీ పరీక్షలు ఎప్రిల్ – 15 నుండి

దూరవిద్య ద్వారా విద్యను అందిస్తున్న డాక్టర్‌ బీఆర్‌ అంబే‌ద్కర్‌ సార్వత్రిక విశ్వవి‌ద్యా‌ల‌యంలో డిగ్రీ వార్షిక పరీ‌క్షలు ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభం కాను‌న్నాయని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. కావున విద్యార్థులు మార్చి 25 లోపల పరీక్ష పీజు చెల్లించాలని పేర్కొన్నారు.

డిగ్రీ మూడో సంవ‌త్సరం పరీ‌క్షలు ఏప్రిల్‌ 15 నుంచి 20 వరకు రెండో సంవ‌త్సరం పరీ‌క్షలు ఏప్రిల్‌ 22 నుంచి 27 వరకు మొదటి సంవ‌త్సరం పరీ‌క్షలు ఏప్రిల్‌ 28 నుంచి మే 1 వరకు జరు‌గ‌ను‌న్నాయి.

అభ్యర్థులు మార్చి 25లోగా పరీక్ష ఫీజు చెల్లిం‌చా‌లని, పరీ‌క్షకు రెండు‌ రో‌జుల ముందు హాల్‌‌ టి‌కెట్లు డౌన్లోడ్‌ చేసు‌కో‌వా‌లని వర్శిటీ అధి‌కా‌రులు సూచించారు.

Follow Us@