హైదరాబాద్ (మే – 09) : డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU PG EXAMS 2023 SCHEDULE) పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) పరీక్షలు జులై 3 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు.
పీజీ (చరిత్ర, ఆర్థిక, రాజనీతి, సామాజిక, ప్రభుత్వపాలనా శాస్త్రాలు, ఆంగ్లం, తెలుగు, హిందీ, ఉర్దూ, మాస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్), ఎంకాం, ఎంఎస్సీ (గణితం, భౌతిక, రసాయన, వృక్ష, జంతు, పర్యావరణ, మనస్తత్వశాస్త్రాలు), ఎంబీఏ, ఇన్ఫర్మేషన్ సైన్స్(ఎంఎస్ఐ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఎస్సీ), బీఎల్ఎస్ఐఎస్సీ, అన్ని డిప్లొమాలు, సర్టిఫికెట్ కోర్సులకు పరీక్షలు ఉంటాయని తెలిపారు.
విద్యార్థులు అధికారిక వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలి. అనంతరం పరీక్ష రుసుంను టీఎస్/ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా చెల్లించాలి. ఆన్లైన్ దరఖాస్తుకు జూన్ 2 చివరి తేదీగా ప్రకటించారు.