BPNL Recruitment 2023 : పది‌, ఇంటర్ తో 3,444 ఉద్యోగాలు

రాజ‌స్థాన్ (జూన్ – 21) : జైపూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) 3,444 పోస్టుల‌ను భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది.

పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హతతో సర్వే ఇన్‌ఛార్జ్ (Survey in charge), సర్వేయర్ (Surveyor) పోస్టులను భర్తీ చేయనున్నారు.

◆ మొత్తం పోస్టులు : 3,444

సర్వే ఇన్‌ఛార్జ్ – 574 పోస్టులు

సర్వేయర్ – 2870 పోస్టులు

అర్హ‌త‌లు : గుర్తింపు పొందిన బోర్డు నుంచి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.

◆ ఎంపిక విధానం : ఆన్‌లైన్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ద్వారా

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్‌లో

వ‌యోపరిమితి : పోస్టుల‌ను బ‌ట్టి 18 నుంచి 40 ఏండ్ల మ‌ధ్య ఉండాలి.

వేతనం : రూ.20,000 నుంచి రూ.24,000

◆ చివరి తేదీ : జూలై 05

ద‌ర‌ఖాస్తు ఫీజు : సర్వే ఇన్‌ఛార్జ్ (రూ.944/- ), సర్వేయర్ (రూ.826/- )

◆ వెబ్‌సైట్ : www.bharatiyapashupalan.com