BIKKI NEWS (DEC. 27) : Boxing day test day 2 highlights. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న 4వ టెస్టులో రెండవ రోజు ఆట ములసే సమయానికి భారత్ 164/5 పరుగులతో ఆడుతుంది.
Boxing day test day 2 highlights
అంతకుముందు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో 474 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కమ్మిన్స్ 49 పరుగులతో రాణించాడు.
భారత బౌలర్లలో బుమ్రా – 4, రవీంద్ర జడేజా – 3, ఆకాష్ దీప్ -2 వికెట్లతో రాణించారు.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టుకు రోహిత్ శర్మ తక్కువ పరుగులకే అవుట్ కావడంతో ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. టీ విరామానికి ముందు చివరి బంతికి ఫామ్ లో కనిపించిన కేఎల్ రాహుల్ (24) అవుట్ అయ్యాడు.
అనంతరం యశస్వీ జైశ్వాల్ (82) పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ (36) పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో రిషభ్ పంత్ (6), జడేజా (4) లు ఉన్నారు.
భారత్ పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా స్టీవ్ స్మిత్ (11 ) రికార్డు నెలకొల్పాడు.
అలాగే టెస్టులో 34వ సెంచరీ ని స్టీవ్ స్మిత్ నమోదు చేశాడు.
సంక్షిప్త స్కోర్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 474/10
టీమిండియా తొలి ఇన్నింగ్స్ : 164/5
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్