అహ్మదాబాద్ (మార్చి – 13) : ఆస్ట్రేలియా – భారత్ మద్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిఫ్ 2023 కు భారత్ అర్హత సాదించింది. మొదటి రెండు టెస్టులు భారత్ గెలవగా.. మూడో టెస్ట్ ఆస్ట్రేలియా గెలిచింది… నాలుగో టెస్టు డ్రా గా ముగిసింది.
నాలుగో టెస్ట్ ఐదవ రోజు ఆటలో టీ సమాయనికి ఆస్ట్రేలియా 175/2 పరుగుల తో ఉండడంతో ఫలితం తేలదు అని డ్రా కు ఇరుజట్లు అంగీకరించడంతో డ్రా గా ముగిసింది.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా విరాట్ కోహ్లీ, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా రవీంద్ర జడేజా మరియు రవిచంద్రన్ అశ్విన్ లు నిలిచారు.
భారత్ వరుసగా నాలుగో సారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ని గెలుచుకుంది.