గ్రామాల అభివృద్ధికి గ్రంధాలయాలు పట్టుగొమ్మలు – శ్రీనివాస్ గౌడ్

ఖానాజీపేట గ్రామానికి చెందిన చెర్కు రమేష్ తన తండ్రి యాదగిరి జ్ఞాపకార్థం రఘునాథపల్లి గ్రామ పాఠశాల ఆవరణలో నూతన గ్రాంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రంధాలయానికి అవసరం అయిన 16 వేల రూపాయలు విలువ చేసే పుస్తకాలను జాఫర ఘఢ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తున్న రాగీరు శ్రీనివాస్ గౌడ్ తన తల్లిదండ్రులు అయిన ఎల్లమ్మ, రామస్వామి ల జ్ఞాపకార్దం అందించారు.

ఈ సందర్భంగా రాగీరు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తమ గ్రామ విద్యార్థులు పోటీ పరీక్షలలో ముందుండాలనే ఉద్దేశ్యంతో ఈ వితరణ చేశానని… గ్రూప్స్, పోలీసు , డీయస్సీ, ఎంసెట్, నీట్, జేఈఈ వంటీ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు మరియు కొన్ని నవలలను అందించానని తెలిపారు. అలాగే భవిష్యత్తులో గ్రామ అబివృద్దికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా జాఫర్ ఘడ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అంజనేయ రాజు, అధ్యాపక బృందం మరియు గ్రామ సర్పంచ్ గొరిగె భాగ్య, గ్రంధాలయ చైర్మన్ రమేష్, గ్రామ వార్డ్ సభ్యులు చెర్కు రమేష్ లు రాగీర్ శ్రీనివాస్ గౌడ్ ను అభినందించారు.