ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సంస్కృతం ప్రవేశపెట్టే ఆలోచన లేదు – బోర్డు ప్రకటన

BIKKI NEWS (APR. 25) : Board says There is no plan to introduce Sanskrit in government junior colleges. తెలుగుకు ప్రత్యామ్నాయంగా సంస్కృతం సబ్జెక్టును ప్రవేశపెడుతున్నట్లు పేర్కొంటున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని, రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి. జయప్రద బాయి గారు తెలియజేశారు.

Board says There is no plan to introduce Sanskrit in government junior colleges

ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగినరిక్రూట్మెంట్ లో 10సంస్కృతంపోస్టు లను భర్తీ చేయడం కోసం ఏ యే కళాశాలలలో ఖాళీలు ఉన్నాయో, విద్యార్థులు ఎంతవరకు ఎంపిక చేసుకుంటున్నారు అనే విషయాలను ప్రిన్సిపాల్ ల నుండి తెలుసుకునేందుకు అంతర్గత సమాచారం నిమిత్తం డైరెక్టర్, ఇంటర్మీడియట్ విద్య ఒక మెమోవిడుదల చేసింది. దీని ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తెలుగుకు ప్రత్యామ్నాయంగా సంస్కృతంను ప్రోత్సహించే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు.

తెలుగు పట్ల ఇంటర్మీడియట్ విద్యా శాఖకు గౌరవం, అభిమానం ఉన్నాయి. ఇదే రిక్రూట్మెంట్ లో 60 తెలుగు పోస్టులను నూతనంగా భర్తీ చేయడం జరిగింది. రాష్ట్ర అధికారక భాష తెలుగును నిలబెట్టడం కోసం మా ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాము. తెలుగుకు ప్రత్యామ్నాయంగా సంస్కృతం ను ప్రోత్సహిస్తుందనడం తప్పుడు వార్తగా గుర్తించాలి. ఇంటర్మీడియట్ విద్య శాఖ తీసుకునే నిర్ణయాలు పౌర సమాజం అభీష్టానికి అనుకూలంగా ఉండేవిధంగా ఉంటాయని గుర్తించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ స్థాయిలో ద్వితీయ భాషగా తెలుగుకి సముచిత స్థానం ఉండాలని కోరుతూ సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన అధ్యాపకులు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్య శాఖడైరెక్టర్ శ్రీ. కృష్ణ ఆదిత్య గారికి మరియు రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి. జయప్రద బాయిగారి కి వినతి పత్రం అందజేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు