తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు బోర్డు పరీక్ష లైనా నైతికత – మానవ విలువలు మరియు పర్యావరణ విద్య పరీక్షలను ఇంటివద్దనే అసైన్మెంట్ రూపంలో రాసి కళాశాలకు సమర్పించాలని బోర్డు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు తమ అధికారిక వెబ్సైట్లో నైతికత – మానవ విలువలు మరియు పర్యావరణ విద్య మోడల్ పేపర్లను అందుబాటులో ఉంచింది.
★ మోడల్ పేపర్లు ::
నైతికత – మానవ విలువలు & పర్యావరణ విద్య మోడల్ పేపర్స్ (TM, EM & UM)
ఈ మోడల్ పేపర్లను యధాతధంగా లేదా ఈ మోడల్ పేపర్ ను అనుసరించి నూతన ప్రశ్నాపత్రాన్ని తయారుచేసి విద్యార్థులతో అసైన్మెంట్ వ్రాపించవలసిందిగా బోర్డు ఒక ప్రకటన లో తెలిపింది.
ఈ రాసిన అసైన్మెంట్ లను ఏప్రిల్ 20వ తేదీ లోపు విద్యార్థులు నేరుగా కళాశాలలోగాని, రిజిస్టర్ పోస్టు ద్వారా గాని లేదా స్కాన్ చేసి పిడిఎఫ్ ఫైల్ ను కళాశాల మెయిల్ కు గాని పంపే అవకాశాన్ని కూడా బోర్డు విద్యార్థులకు కల్పించింది.
Follow Us @