IPC, CRPC, EVIDENCE ACTS స్థానంలో నూతన న్యాయ చట్టాలు

BIKKI NEWS : BNS BNSS BS ARE REPLACED IPC CRPC EVIDANCE ACTS. భారత దేశ చరిత్రలో ముఖ్య చట్టాలు గా పేరుగాంచిన IPC – 1860, CRPC – 1898, EVIDENCE ACTS – 1872 ల స్థానంలో నూతన చట్టాలను తీసుకురావాలని పార్లమెంట్ లో ఆగస్టు 11 – 2023 న కేంద్రం మూడు నూతన బిల్లులను ప్రవేశపెట్టింది. అవి… new evidence acts in india 2024

BNS BNSS BS ARE REPLACED IPC CRPC EVIDANCE ACTS

ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(IPC) -1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత (BNS)-2023,

క్రిమినల్‌ ప్రొసీజర్‌ యాక్ట్‌ (CRPC)-1898 స్థానంలో భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత(BNSS)-2023,

ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌-1872 స్థానంలో భారతీయ సాక్ష్య(BS)-2023 బిల్లులను తీసుకొచ్చారు.

ప్రజలకు సత్వర న్యాయం అందించడంతో పాటు ప్రజల ప్రస్తుత అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా న్యాయవ్యవస్థను మార్చేందుకు తాజా బిల్లులను రూపొందించామని అమిత్‌షా అన్నారు. ప్రతి ఒక్కరూ గరిష్ఠంగా మూడేండ్లలో న్యాయం పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కొత్త బిల్లుల ఉద్దేశం శిక్షించడం కాదని, బాధితులకు న్యాయం అందించడమని పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో నేరాలను ఆపేందుకు శిక్షలు కూడా ఉంటాయని అన్నారు.

ఈ 3 బిల్లులను తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి (హోం వ్యవహారాలు) పంపారు. ఏడు దశాబ్దాల భారత ప్రజాస్వామ్యంలోని అనుభవాలు.. సీఆర్‌పీసీతో పాటు క్రిమినల్‌ చట్టాలను సమగ్రంగా మార్చడానికి కారణమని ప్రభుత్వం పేర్కొన్నది.

లైంగిక దాడికి 10 ఏండ్లకుపైగా శిక్ష

హత్యలు, మహిళలపై లైంగిక దాడులకు సంబంధించి కొత్త నిబంధనలు చేర్చారు. హత్యానేరానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడుతుంది. లైంగిక దాడుల నిందితులకు కనీసంగా 10 ఏండ్లు లేదా జీవిత ఖైదు శిక్ష విధిస్తారు. అలాగే సామూహిక లైంగిక దాడుల కేసుల్లోని నిందితులకు కనీసంగా 20 ఏండ్లు శిక్ష ఉంటుంది లేదా జీవిత ఖైదు పడుతుంది. కొత్త బిల్లుల ప్రకారం.. లైంగిక దాడి తర్వాత బాధిత మహిళ మరణిస్తే లేదా అచేతన స్థితికి(కోమా లాంటి స్థితి) చేరితే, దోషికి 20 ఏండ్లు తగ్గకుండా కఠిన శిక్ష విధించొచ్చు. దాన్ని జీవిత ఖైదుకు పొడిగించడం లేదా మరణ శిక్ష కూడా వేయవచ్చు. 12 ఏండ్ల కంటే తక్కువ వయసున్న బాలికలపై లైంగిక దాడికి పాల్పడితే, ఆ నిందితుడికి 20 ఏండ్లు తక్కువ కాకుండా శిక్ష పడుతుంది. దీన్ని జీవిత ఖైదు లేదా మరణ శిక్ష వరకు పొడిగించవచ్చు.

పెండ్లి పేరుతో లైంగిక దాడికి పాల్పడితే నేరమే

మహిళలను మోసం చేసి, వారిని లైంగికంగా లోబరుచుకొనే ఘటనలకు సంబంధించి కూడా కీలక మార్పులు చేపట్టారు. కొత్త నిబంధనల ప్రకారం గుర్తింపును దాచి పెండ్లి చేసుకోవడం లేదా పెండ్లి, ఉద్యోగం, ప్రమోషన్‌ పేరుతో మహిళలపై లైంగిక దోపిడీకి పాల్పడడం నేరం కిందకు వస్తుంది. జరిమానాతో పాటు 10 ఏండ్ల వరకు శిక్ష ఉంటుంది.

క్షమాభిక్ష విషయంలో మార్పులు

శిక్ష పడిన నేరస్తులకు క్షమాభిక్ష విషయంలో కూడా పలు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. క్షమాభిక్ష లేదా శిక్ష రద్దును ప్రభుత్వాలు తమ రాజకీయ అవసరాల కోసం వినియోగించుకోకుండా.. మరణశిక్షను కేవలం జీవిత ఖైదుగా మార్చుకోగలరని నిబంధన చేర్చారు. కొత్త మార్పు ప్రకారం జీవిత ఖైదు పడిన ఏడేండ్ల వ్యవధిలోపే ఆ నేరస్తుడికి క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంటుంది. ఇటీవల విడుదలైన బీహార్‌కు చెందిన క్రిమినల్‌-పొలిటీషియన్‌ ఆనంద్‌ మోహన్‌ అంశాన్ని అమిత్‌షా ప్రస్తావించారు.

రాజద్రోహానికి కొత్త రూపు

కేంద్రం తీసుకొచ్చిన బిల్లుల్లో ఏండ్లుగా చర్చనీయాంశంగా ఉన్న పలు ప్రధానఅంశాలున్నాయి. భారతీయ న్యాయ సంహిత బిల్లులో రాజద్రోహం(ఐపీసీ 124ఏ) రద్దు, మూకహత్యలు, మైనర్లపై లైంగిక దాడుల నేరాలకు మరణశిక్ష విధించేలా నిబంధనలు ఉన్నాయి. రాజద్రోహం చట్టాన్ని పూర్తిగా తొలగించనున్నారు. దీన్ని కొత్త రూపంలో తీసుకొస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. దీని కింద దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే జీవిత ఖైదు విధించనున్నారు. ‘రాజద్రోహం’గా ఉన్న చట్టం కొత్తగా ‘దేశద్రోహం’గా మారుతుందని అధికారులు పేర్కొన్నారు. వేర్పాటువాదం, సాయుధ తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు, దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు ముప్పు కలిగించే చర్యలకు గరిష్ఠంగా జీవిత ఖైదు విధింపు ఉంటుంది. మూక హత్యలు, మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడితే మరణశిక్ష విధిస్తారు.

నేరాలకు గరిష్ఠ శిక్షలు

  • దేశ సార్వ భౌమాధికారం, సమగ్రతకు ముప్పు – జీవిత ఖైదు.
  • సామూహిక లైంగిక దాడి – కనిష్ఠంగా 20 ఏండ్ల నుంచి జీవిత ఖైదు
  • మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడితే – మరణశిక్ష
  • మూక హత్యలకు పాల్పడితే – మరణశిక్ష

కొత్త బిల్లులలో కీలక అంశాలు

మూడు బిల్లుల్లో మొత్తంగా 300కు పైగా మార్పులు చేపట్టారు.

మొదటిసారిగా రూ.5 వేల కంటే తక్కువ విలువైన వస్తువుల చోరీ, పరువు నష్టం, మద్యం మత్తులో పబ్లిక్‌లో అసభ్య ప్రవర్తన వంటి చిన్న నేరాలకు పాల్పడితే ‘సమాజ సేవ’ను శిక్షగా విధిస్తారు.

పోలీసు అధికారి లేదా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి, భద్రతా దళాలకు చెందిన సభ్యుడు లైంగికదాడికి పాల్పడితే, 10 ఏండ్ల తక్కువ కాకుండా లేదా జీవిత ఖైదు విధించొచ్చు.

ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొనేందుకు కారణమైతే 10 ఏండ్ల వరకూ జైలు శిక్ష. జరిమానా కూడా పడే అవకాశం.

ఎఫ్‌ఐర్‌ నమోదు నుంచి కేసు డైరీ, చార్జిషీట్‌, తీర్పు వరకు మొత్తం ప్రక్రియ అంతా డిజిటలైజేషన్‌.

ఏండేండ్లు లేదా అంత కంటే ఎక్కువ శిక్ష పడే కేసుల్లో ఫోరెన్సిక్‌ బృందం నేరం జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించాలి.

2027 నాటికి దేశంలోని అన్ని కోర్టులు కంప్యూటరీకరణ.

త్వరలోనే ఈ-ఎఫ్‌ఐఆర్‌ల నమోదుకు శ్రీకారం.

కేసులపై 90 రోజుల్లోగా చార్జిషీట్‌ వేయాలి.

దర్యాప్తు 180 రోజుల్లో పూర్తి చేసి, కోర్టు విచారణకు వెళ్లాలి. విచారణ తర్వాత 30 రోజుల్లోగా తీర్పు.

లైంగిక నేరాల్లో బాధితుల స్టేట్‌మెంట్‌, వీడియో రికార్డింగ్‌ తప్పనిసరి.

బాధితుల వాదనలు వినకుండా, ఏండేండ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే ఏ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోకూడదు.

సివిల్‌ సర్వెంట్లపై ఫిర్యాదులను నమోదుకు అధికారులు 120 రోజుల్లోగా అనుమతి ఇవ్వడమో లేదా తిరస్కరించడమో చేయాలి.

ఆస్తి నష్టానికి నేరానికి పాల్పడిన వ్యక్తే పరిహారం చెల్లించేలా నిబంధన.

తొలిసారిగా ఉగ్రవాదానికి నిర్వచనం ఇచ్చారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతకు ముప్పు కలిగించే ఉద్దేశంతో, సాధారణ ప్రజానీకాన్ని లేదా అందులోకి ఒక వర్గాన్ని భయపెట్టే ఉద్దేశం లేదా శాంతి భద్రతలకు భంగం కలిగించేలా దేశంలో లేదా ఇతర విదేశాల్లో చర్యలకు పాల్పడే వారిని ‘టెర్రరిస్టు’ అంటారు.

ఉగ్ర చర్యల కారణంగా ఎవరైనా మరణిస్తే.. నిందితుడికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు ఉంటుంది.

CURRENT AFFAIRS BITS

TELEGRAM CHANNEL