BHMS ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల

ప్రైవేట్ హోమియోపతి కళాశాలలో BHMS కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్ కు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, అర్హుల జాబితాను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చామని తెలిపింది.

ఆన్లైన్ కౌన్సెలింగ్ కు అర్హులైన అభ్యర్థులు ఈనెల 5 నుంచి జేఎన్టీయూ, కూకట్‌పల్లి, హైదరాబాద్లో హాజరుకావాల్సి ఉంటుందని వెల్లడించింది.

యూనివర్సిటీ వెబ్సైట్ :- www.knruhs.telangana.gov.in

Follow Us @