17, 18 తేదీలో నల్ల బ్యాడ్జీలతో కాంట్రాక్ట్ లెక్చరర్ ల నిరసన – TIPS

  • కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ జాబితా ప్రభుత్వానికి పంపడంలో కమిషనరేట్ నిర్లక్ష్యానికి నిరసన
  • ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్నా కాంట్రాక్ట్ లెక్చరర్ క్రమబద్ధీకరణ కొరకు జాబితా సచివాలయానికి పంపటంలో ఇంటర్ విద్యా కమిషనర్ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జూన్ 17, 18 తేదీలలో ఉదయం నుంచి భోజన సమయం వరకు వరకు నల్లబ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తామని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి సమన్వయకర్త మైలవరపు జంగయ్య రాష్ట్ర కన్వీనర్లు మాచర్ల రామకృష్ణ గౌడ్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలియజేశారు.

ముఖ్యమంత్రి వర్యులు మానవతా దృక్పథంతో కాంట్రాక్టు ఉద్యోగులు /అధ్యాపకుల క్రమబద్ధీకరణ కొరకు జీవో నెంబర్ 16 జారీ చేయడం జరిగిందని… మార్చి నెలలో ఆర్థిక & మరియు ఉన్నత విద్యా శాఖ కాంట్రాక్టు అధ్యాపకుల జాబితా గురించి ఇంటర్ విద్య కమిషనరేట్ కు జాబితా పంపాలని లేఖలు జారీ చేయడం జరిగింది కానీ ఇంతవరకు ఇంటర్ విద్య కమిషనరేట్ నుంచి క్రమబద్ధీకరణ కొరకు జాబితా ప్రభుత్వానికి పంపలేదని గుర్తు చేశారు.

ఈ విషయంపై పలుమార్లు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని… కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆవేదనను ఇంటర్ విద్య కమిషనర్ కు తెలియజేయడానికి జూన్ 14న ఇంటర్ విద్య కమిషనర్ కార్యాలయం వద్ద వేలాది మందితో ఆవేదన సభ నిర్వహించడం జరిగిందని. కానీ ఇంతవరకూ ఎలాంటి స్పందన లేకపోవడంతో క్రమబద్ధీకరణ జాబితా పంపటంలో ఆలస్యము నిరసిస్తూ జూన్ 17, 18తేదీ లలో ఉదయం నుంచి మధ్యాహ్నం భోజన సమయం వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇంకా క్రమబద్ధీకరణ జాబితా పంపడంలో ఆలస్యం జరిగితే భవిష్యత్తు కార్యక్రమం రూపొందిస్తామని తెలియపరుస్తూ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న జనరల్ మరియు వోకేషనల్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరు క్రమబద్ధీకరణ జాబితా వెంటనే ప్రభుత్వాన్ని పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Follow Us @