జీవో 16 పై కోర్టు తీర్పు పట్ల హర్షం – ఏపీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం

తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కొరకు విడుదల చేసిన జీవో నంబర్ 16 పై విధించిన స్టేని ఎత్తివేస్తూ అందుకు కారణామైన పిల్ ను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పు పై ఏపీ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ 475 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ మరియు తూర్పుగోదావరి జిల్లా కమిటీ హర్షం వ్యక్తం చేశాయి.

ఈ సందర్భంగా గాంధీ ప్రముఖ న్యాయవాది జివిఎల్ మూర్తి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, జి. రమణారెడ్డి లను శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైకోర్టు తీర్పును అనుసరించి వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను, కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరణ చేయడానికి మార్గదర్శకాలు విడుదల చేయవలసిందిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బీజే గాంధీ, శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేయడం జరిగింది.

Follow Us @