బిట్స్ పిలానీ లో డిగ్రీ కోర్సులలో ప్రవేశానికి పరీక్ష

ఇంజినీరింగ్‌ విద్యకు దేశంలో పేరుగాంచిన సంస్థ. ఐఐటీలతో పోటీపడుతూ, ప్రామాణికమైన విద్యను అందించే సంస్థగా బిట్స్‌కు పేరుంది. క్యూఎస్‌ ర్యాంకింగ్‌లో దేశంలో నాన్‌ గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో బిట్స్‌ ఉన్నత స్థానంలో నిలిచింది. దేశంలో ప్రముఖ విశ్వవిద్యాలయంగా మారింది. పిలానీ, గోవా, హైదరాబాద్‌తోపాటు దుబాయ్‌లో క్యాంపస్‌లు ఉన్నాయి. నాణ్యమైన విద్యతోపాటు పరిశోధనలకు పెద్ద పీట వేస్తున్నది. బిట్స్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదలైంది.

◆ ప్రవేశాలు కల్పించే కోర్సులు – క్యాంపస్‌లు (పిలానీ, గోవా, హైదరాబాద్‌)

● బిట్స్‌ పిలానీ

 • బీఈ: కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌సైన్స్‌, ఎలక్ట్రికల్‌ &ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్‌, మెకానికల్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌.
  బీఫార్మా
 • ఎమ్మెస్సీ: బయలాజికల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, జనరల్‌ స్టడీస్‌.

● బిట్స్‌ (కేకే బిర్లా క్యాంపస్‌) గోవా

 • బీఈ: కెమికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ &కమ్యూనికేషన్‌, ఎలక్ట్రికల్‌ &ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ & ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్‌.
 • ఎమ్మెస్సీ: బయలాజికల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌

● బిట్స్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌

 • బీఈ: కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్‌, ఎలక్ట్రికల్‌ & ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ & ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌.
 • బీఫార్మా
  ఎమ్మెస్సీ: బయలాజికల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌

◆ అర్హతలు ::

 • బీఈ, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశం కోసం మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్‌ లేదా 10+2 విధానంలో కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా బైపీసీలో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అదేవిధంగా ఎంపీసీ/బైపీసీ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో తగినంత నైపుణ్యం ఉండాలి.
 • బీఫార్మా అభ్యర్థులు ఇంటర్‌లో బైపీసీ కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపీసీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 • 2021లో ఫైనల్‌ ఇంటర్‌ పరీక్షలు రాస్తున్నవారు లేదా 2020లో పరీక్ష పాసైన వారు బిట్‌శాట్‌ రాయడానికి అర్హులు.
 • సెంట్రల్‌/స్టేట్‌ బోర్డులో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన విద్యార్థులకు బిట్‌శాట్‌ స్కోర్‌తో సంబంధం లేకుండా నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. వాటికి సంబంధించిన వివరాలు 2021, జూన్‌ 15న వెబ్సైట్‌లో పెడుతారు.

◆ పరీక్ష విధానం ::
ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష. మూడుగంటల కాలవ్యవధిలో నిర్వహిస్తారు.
నాలుగు విభాగాలు ఉంటాయి. పార్ట్‌- 1లో ఫిజిక్స్‌, పార్ట్‌- 2లో కెమిస్ట్రీ, పార్ట్‌- 3లో ఇంగ్లిష్‌ ఫ్రొఫిషియన్సీ, లాజికల్‌ రీజనింగ్‌, పార్ట్‌ – 4లో మ్యాథ్స్‌/బయాలజీ (బీఫార్మా అభ్యర్థులకు)
ఫిజిక్స్‌ – 40, కెమిస్ట్రీ – 40, మ్యాథ్స్‌/బయాలజీ – 45, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ -15, లాజికల్‌ రీజనింగ్‌ – 10 మార్కుల చొప్పున మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది.
ఇచ్చిన సమయం మిగిలిపోతే ప్రతి సబ్జెక్టు నుంచి నాలుగు ప్రశ్నల చొప్పున మొత్తం 12 అదనపు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే అవకాశం ఇస్తారు.

● సిలబస్‌ :: NCERT 11, 12వ తరగతి పాఠ్యాంశాల్లో నుంచి ప్రశ్నలు ఇస్తారు.

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్‌లో

● దరఖాస్తుకు చివరి తేదీ :: మే 29 (సాయంత్రం 5 వరకు)

● పరీక్ష కేంద్రాలు :: తెలంగాణలో హైదరాబాద్‌ బిట్స్‌ క్యాంపస్‌, హైదరాబాద్‌ సిటీ.

● పరీక్ష కేంద్రాల అలాట్‌మెంట్‌ :: జూన్‌ 2

● బిట్‌శాట్‌ ఆన్లైన్‌ టెస్ట్‌లు :: జూన్‌ 24-30 మధ్య నిర్వహిస్తారు

● ఫీజు వివరాలు :: ₹ 3,400/- బాలురకు (₹ 2900/- బాలికలకు)

● వెబ్సైట్‌ :: www.bitsadmission.com

Follow Us@