BIKKI NEWS (SEP. 24) : BISF Course for Jobs in telangana. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పనలో భాగంగా డిగ్రీ, ఇంజనీరింగ్ చేస్తున్న దాదాపు 10 వేల మంది విద్యార్థులకు బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగంలో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కొత్త కార్యక్రమం ప్రారంభిస్తోంది.
BISF Course for Jobs in telangana
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో వేలాది మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం తాజాగా ఈ ఏడాది నుంచే బ్యాంకింగ్ రంగంలోనూ శిక్షణ ఇప్పించనుంది. ఈ నెల 25న శిక్షణా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
20 ఇంజనీరింగ్, 18 డిగ్రీ కాలేజీల ఎంపిక..
‘బీఎస్ఎఫ్ఎ’ రంగంలో పేరొందిన కంపెనీలన్నీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. అయితే ఈ రంగంలో శిక్షణ ఖరీదైనది కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని డిగ్రీ విద్యార్థుల కోసం శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించింది.
సీఎం రేవంత్ చొరవతో తెలంగాణ ఉన్నత విద్యామండలి.. బీఎఫ్ఎస్ఐ కన్సార్షియంతో ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఖరీదైన మినీ డిగ్రీ ప్రోగ్రాంకు రూపకల్పన చేసింది.
విద్యార్థులు సాధారణ డిగ్రీ కోర్సుతోపాటే ఈ కోర్సును చదవొచ్చు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఉన్నత విద్యా శాఖ ఎంపిక చేసిన 20 డిగ్రీ కాలేజీలు, 18 ఇంజనీరింగ్ కాలేజీల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కోర్సులను నిర్వహించనున్నారు.
5 వేల మంది ఇంజనీరింగ్, 5 వేల మంది నాన్ ఇంజనీరింగ్ కేటగిరీల్లో మొత్తం 10 వేల మంది విద్యార్థులకు ఈ వర్క్ కోర్సు నేర్పించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.