మొక్కలు నాటుదాం – పర్యావరణాన్ని రక్షించుకుందాం – బర్త్ డే ట్రీ ఫౌండేషన్

బర్త్ డే ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మబ్బు జోష్న జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం కళ్లెం గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా బర్త్ డే ట్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మబ్బు పరశురాం మాట్లాడుతూ ఆయువు లేనిదే మనిషే లేడు ఆయువును ఇచ్చేది పచ్చని మొక్క అని తెలుపుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

జన్మ దినాల సందర్భంగా సమాజానికి ఉపయోగపడే విధంగా వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం మొక్కలు నాటే ఇంత మంచి కార్యక్రమాన్ని అందరూ చేపట్టాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తూ, శానిటీజర్ ఉపయోగించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బర్త్ డే ట్రీ ఫౌండేషన్ అధ్యక్షుడు మబ్బు కరుణాకర్, ప్రధాన కార్యదర్శి నక్కీర్త మహేష్, CEO మల్లేష్, క్రాంతి, నరేష్, చింటు, లక్కీ, సన్ని తదితరులు పాల్గొన్నారు.

Follow Us@