న్యూడిల్లీ (సెప్టెంబర్ – 15) : BIRTH CERTIFICATE IS ONLY ONE CERTIFICATE FOR ALL SERVICESS.. జనన, మరణాల రిజిస్ట్రేషన్ (సవరణ) చట్టం-2023 ప్రకారం విద్యా సంస్థలలో ప్రవేశాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, పాస్ పోర్ట్, వివాహాల రిజిస్ట్రేషన్లు, తదితర ప్రభుత్వ ప్రైవేటు సేవలకు ఇకనుంచి జనన ధ్రువీకరణ పత్రాన్ని అధికారికంగా
ఉపయోగించుకోవచ్చు.
ఈ మేరకు జనన, మరణాల రిజిస్ట్రేషన్ (సవరణ) చట్టం – 2023ను పార్లమెంటు సవరించగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 11న ఆమోదం తెలిపారు.
సంబంధిత చట్టం అక్టోబరు – 01 – 2023 నుంచి అమల్లోకి వస్తుందని రిజిస్ట్రార్ జనరల్, జన గణన కమిషనర్ ;వెల్లడించారు. ‘జనన ధ్రువీకరణ పత్రంతో వ్యక్తి పుట్టిన తేదీ, జన్మ స్థలాన్ని అధికారికంగా నిర్ధారించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక స్వపరిపాలన సంస్థల్లో ఉద్యోగాల నియామకానికి, ఓటరు జాబితాల తయారీ తదితరాల ఎన్నో సేవలకు ఉపయోగించుకోవచ్చు. జనన, మరణాలపై కేంద్ర, రాష్ట్రాల్లో డేటాబేస్ తయారీ సులువు అవుతుంది’ అని ఆయన వివరించారు.
ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ (అక్టోబర్ 01 – 2023 నుండి), ఆ తర్వాత జన్మించిన వారికి ఈ సర్టిఫికెట్ ను సింగిల్ డాక్యుమెంట్ గా వినియోగించుకోవడానికి వీలుంటుంది. పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశానికి సంబంధించి ఇలా వేర్వేరు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదని కేంద్రం తెలిపింది.