BIKKI NEWS (APR. 08) : BIRD FLU CASE SIDDIPET DISTRICT – TELANGANA. తొగుట మండలం కన్గల్ గ్రామంలో గల మైనా లేయర్ కోళ్ల ఫామ్ లోని కోళ్లకు H5N1 ఏవియన్ ఇన్ఫ్లుంజా వైరస్ (బర్డ్ ఫ్లూ) నిర్ధారణ కావడంతో పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ సంభంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి వ్యాధి విస్తరణ జరుగకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించి తగు ఆదేశాలు జారిచేశారు.
BIRD FLU CASE SIDDIPET DISTRICT – TELANGANA
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కోళ్ల ఫారంలో మొదటిసారి బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందని బర్డ్ ఫ్లూ ప్రభావం ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా, మనుషులకు సోకకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్ లోని కోళ్లు అన్నింటినీ శాస్త్రీయ పద్ధతిలో భూమిలో పూడ్చివేయాలని అన్నారు. కోళ్ల ఫామ్ లో పనిచేసే వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. కిలోమీటర్ లోపు కోళ్లను గాని కోడిగుడ్లు గాని అమ్మకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్ పరిసర ప్రాంతాలలో వాహనాలు రాకపోకలు జరగకుండా పోలీస్ శాఖ వారు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 8500404016 ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు.
74 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉ కోళ్ల మాంసాన్ని కానీ గుడ్లను కానీ ఉడికిస్తే వైరస్ బతకదని అన్నారు. మనదేశంలో 120 డిగ్రీల సెంటిగ్రేడ్ కు పైన ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం సహజంగా జరుగుతుంది కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా 70 డిగ్రీ సెంటిగ్రేడ్ కు పైగా ఉడికించి తినవచ్చని ఉడికించిన కోళ్ల మాంసం గాని కోడిగుడ్లను గాని తిని వాడడం వలన ఎలాంటి అపాయం జరగదని అన్నారు.
ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అశోక్ కుమార్, జిల్లా వైద్యరోగ్యశాఖాధికారి డాక్టర్ పల్వాన్ కుమార్, సిఐ మల్లేష్ గౌడ్, డిపిఆర్ఓ రవికుమార్, డివిజనల్ పంచాయతీ అధికారి మల్లికార్జున్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, అటవీ, పశుసంవర్ధక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్