జూనియర్ కళాశాలలో బయోమెట్రిక్ అటెండెన్స్

హైదరాబాద్ (ఫిబ్రవరి – 03) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టం (AEBAS) ను ఫిబ్రవరి – 1 – 2023 నుండి పూర్తిస్థాయిలో అమలుపరుస్తూ ఇంటర్మీడియట్ కమిషనర్ ఉత్తర్వులు విడుదల చేశారు. కళాశాలలోని స్టాప్ అందరు కి ప్రత్యేక ఐడీలను కేటాయించి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యతను పెంచేందుకు మరియు ఉద్యోగుల వేతనాలను కూడా ఈ అటెండెన్స్ ద్వారానే అందజేయనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

పూర్తి రోజు హాజరు ఉండాలి అంటే బయోమెట్రిక్ హాజర్ లో ఇన్ & ఔట్ మద్య 6 గంటల సమయం ఉండాలని… కనీసం మూడు గంటల తేడాతో బయోమెట్రిక్ ఇన్ అండ్ అవుట్ ఉంటే హాఫ్ డే గా పరిగణిస్తామని… 3 గంటల కంటే తక్కువగా ఉంటే లీవ్ లేదా అబ్సెంట్ గా పరిగణిస్తామని పేర్కొన్నారు.