BIKKI NEWS : భారత కుబేరుల అప్పులపై ఏస్ ఈక్విటీ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం విస్తుపోయో అంశాలు వెల్లడయ్యాయి. సంపదలో ముందు ఉన్న కుబేరులే అప్పులలోనూ (billionaires credits data) ముందు ఉండటం విశేషం.
ఈ నివేదిక ప్రకారం భారత అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా రూ.3.13 లక్షల కోట్ల అప్పుతో తొలి స్థానంలో ఉండటం విశేషం. దేశంలోని పెద్ద విద్యుత్ రంగ కంపెనీలలో ఒకటైన ‘నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC)’ రూ.2.20 లక్షల కోట్ల అప్పుతో జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.
1) రిలయన్స్ ఇండస్ట్రీస్ – 3.13 లక్షల కోట్లు
2) NTPC LIMITED – 2.20 లక్షల కోట్లు
3) VODAFONE IDEA – 2.01 లక్షల కోట్లు
4) AIRTEL – 1.65 లక్షల కోట్లు
5) IOCL – 1.40 లక్షల కోట్ల
6) ONGC – 1.29 లక్షల కోట్ల
7) పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (PGCIL)- 1.26 లక్షల కోట్లు
8) టాటా మోటార్స్ – 1.25 లక్షల కోట్లు
9) L&T – 1.18 లక్షల కోట్లు
10) గ్రాసిమ్ – 1.01 లక్షల కోట్లు