BIKKI NEWS (DEC. 13) : అంతరిక్షంలో క్వాసర్ అనే బ్లాక్ హోల్ చుట్టూ తేలియాడుతున్న అతి భారీ నీటి రిజర్వాయర్ (big reservoir at quasar block hole) ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమిపై ఉన్న మహాసముద్రాల్లోని నీటికంటే 140 ట్రిలియన్ల రెట్ల ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉన్నట్టు ప్రకటించారు.
ఈ నీటి రిజర్వాయర్ భూమి నుంచి 12 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నందున టెలిస్కోప్ తో చూడలేమని పేర్కొన్నారు. క్వాసర్ బ్లాక్ హోల్ చుట్టూ ఉన్న భిన్నమైన వాతావరణమే ఈ నీటి రిజర్వాయర్ ఏర్పడటానికి కారణమని తెలిపారు.