BHARAT RATNA L.K. ADVANI – ఎల్.కే. అద్వానీ కి భారత రత్న

BIKKI NEWS (FEB. 03) : BHARAT RATNA L.K. ADVANI – భారత ప్రభుత్వం లాల్ కృష్ణ అద్వానీ కి దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న ఇస్తున్నట్లు ప్రకటించింది.

లాల్ కృష్ణ అద్వానీ భారతదేశానికి ఉప ప్రధానిగా, హోం శాఖ మంత్రిగా సేవలు అందించారు. అలాగే బిజెపి వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. రథయాత్రతో భారతదేశం అంతా యాత్ర చేసి బిజెపి పార్టీని దేశం నలుమూలల వ్యాపింప చేశాడు. అలాగే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం తీవ్ర కృషి చేశాడు.

ఇటీవల బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారత ప్రభుత్వం భారత రత్న అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.