Home > CURRENT AFFAIRS > BHAGAVAD GITA – యూనెస్కో వారసత్వ సంపదలుగా భగవద్గీత, నాట్యశాస్త్రం

BHAGAVAD GITA – యూనెస్కో వారసత్వ సంపదలుగా భగవద్గీత, నాట్యశాస్త్రం

BIKKI NEWS (APR. 19) : Bhagavadgita and Natya Sashtram placed in UNESCO Heritage list. యునెస్కోకు చెందిన మెమరీ ఆఫ్‌ ది వరల్డ్‌ రిజిస్టర్‌లో భారతదేశ వారసత్వ సంపదలైన భగవద్గీత మరియు భరత ముని రచించిన నాట్యశాస్త్రం రాత ప్రతులకు చోటు దక్కించుకున్నాయి.

Bhagavadgita and Natya Sashtram placed in UNESCO Heritage list

ఈ రిజిస్టర్‌లో కొత్తగా చేర్చిన 74 డాక్యుమెంటరీ వారసత్వ సంపదలలో వైజ్ఞానిక విప్లవం, చరిత్రలో మహిళల పాత్ర, 72 దేశాలు, నాలుగు అంతర్జాతీయ సంస్థల బహుళ పక్ష అంశాలకు చెందిన ప్రధాన మైలురాళ్లు ఉన్నట్లు యునెస్కో తెలిపింది.

రిజిస్టర్‌లో గ్రంథాలు, రాతప్రతులు, చిత్రపటాలు, ఫొటోలు, శబ్ద లేక వీడియో రికార్డింగులు మానవాళికి చెందిన వారసత్వ డాక్యుమెంటరీగా పొందుపరిచి ఉన్నాయి.

ఏప్రిల్‌ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ జాబితా విడుదల చేశారు.

ఇప్పటివరకు మన దేశం నుంచి 14 శాసనాలు యునెస్కో రిజిస్టర్‌లో చోటు దక్కించుకున్నాయి.

నాట్య శాస్త్రం

క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో భరత ముని రచించిన నాట్య శాస్త్రంలో మొత్తం 36,000 శ్లోకాలు ఉన్నాయి. గంధర్వ వేదగా పిలిచే ఈ శ్లోకాలు నాట్యశాస్త్ర సారాన్ని సంపూర్ణంగా తెలియచేస్తాయి.

భగవద్గీత

మహాభారత యుద్ధ రంగంలో బంధు జనులను చూసి అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధను భగవద్గీతగా భారతీయులు విశ్వసిస్తారు. ఇందులో 18 అధ్యాయాలలో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు